నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు: మోహన్ బాబు..! 8 d ago
మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న వార్తలను అయన ఖండించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని 'ఎక్స్' వేదికగా మోహన్ బాబు ట్వీట్ చేశారు. తన ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ప్రస్తుతం తాను ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నానని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నానని పేర్కొన్నారు.